: హ్యాక్ అయిన 'కిస్ ఆఫ్ లవ్' ఫేస్ బుక్ అకౌంట్లు

'నైతిక పో్లీసింగ్'కు నిరసనగా 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమానికి తెరతీసిన ఫేస్ బుక్ బృందం సభ్యుల ఫేస్ బుక్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. దీని వెనుక ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నట్లు బృంద సభ్యుడు రాహుల్ పసుపాలన్ అభిప్రాయపడ్డారు. హ్యాకింగ్‌కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితాలకు ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు. కోచిలోని సాగర తీరంలో తాము జరుపతలపెట్టిన 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమానికి కొందరు వ్యక్తులు మారణాయుధాలు తీసుకుని వచ్చారని ఆయన ఆరోపించారు. కాగా 'కిస్ ఆఫ్ లవ్' ఫేస్ బుక్ అకౌంట్ కు తొంభై వేల వరకూ లైక్ లు వచ్చాయని రాహుల్ పసుపాలన్ తెలపారు.

More Telugu News