: చెత్త నుంచి కూడా డబ్బు సంపాదించడమెలాగో ఆలోచించాలి: చంద్రబాబు

కర్నూలు జిల్లా హుస్సేనాపురంలో జరిగిన 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'స్వచ్ఛ భారత్'లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. చిన్న గ్రామాలు ఆధునికత సంతరించుకోవాలని, ప్రజలు చెత్త నుంచి కూడా డబ్బు సంపాదించడం ఎలాగో ఆలోచించాలని సూచించారు. మరుగుదొడ్లపై డ్వాక్రా మహిళలు చైతన్యం తీసుకురావాలని అన్నారు. మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు ఇస్తామని చెప్పారు. మరుగుదొడ్డి నాగరికతకు చిహ్నమని బాబు పేర్కొన్నారు. 'బడి పిలుస్తోంది' కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తామని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. పేదరికంపై గెలుపులో ఏపీ ఆడబిడ్డల సహకారం కావాలన్నారు.

More Telugu News