: కృష్ణా బోర్డు ఛైర్మన్ ను కేసీఆర్ విమర్శించడం బాధనిపిస్తోంది: చంద్రబాబు

శ్రీశైలం జలాల వివాదంలో కృష్ణా బోర్డు ఛైర్మన్ కృష్ణ పండిట్ పై కేసీఆర్ వ్యాఖ్యానించడంపై చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు కర్నూలు జిల్లా హుస్సేనాపురంలో ఏర్పాటు చేసిన జన్మభూమి- మాఊరు కార్యక్రమంలో బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కృష్ణా బోర్డు ఛైర్మన్ ను విమర్శించడం బాధనిపిస్తోందన్నారు. ఇద్దరం కూర్చొని సమస్యలు పరిష్కరించుకుందామని కేసీఆర్ కు సూచించారు. కార్మికశాఖ నిధులను సైతం వివాదం చేస్తున్నారన్నారు. ఏపీ నిధులు మాత్రమే బదిలీ అయ్యాయని, తెలంగాణ నిధులు అక్కడే ఉన్నాయని వివరించారు.

More Telugu News