: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు కేజ్రీవాల్ లేఖ
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను ఈ ఉదయం కలసిన బీజేపీ నేతలు తాము ప్రభుత్వం ఏర్పాటు చేయబోమని, కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో సాయంత్రం కాంగ్రెస్, ఏఏపీ నేతలను పిలిచి గవర్నర్ మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గవర్నర్ కు లేఖ రాశారు. "ఇప్పటికే మీరు అతిపెద్ద పార్టీ అయిన బీజేపీతో మాట్లాడారు. ఈ విషయంపై వారి అధికారిక నిర్ణయం ఏమిటో చెబితే సంతోషిస్తాను" అని పేర్కొన్నారు.