: నేడు టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభం

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేడు హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ప్రారంభం కానుంది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తొలి సభ్యత్వం తీసుకుని సభ్యత్వ నమోదును లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీ సభ్యత్వం తీసుకుంటారు. సభ్యత్వం నమోదు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాలుపంచుకుంటారు. రూ.100 రుసుముతో పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకునే సభ్యులకు రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ పార్టీ ఇటీవలే తీర్మానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ దఫా జరగనున్న సభ్యత్వ నమోదులో భారీగా క్రియాశీల సభ్యులు చేరే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ మేరకు ఏర్పాట్లు చేసినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.

More Telugu News