: అక్క బంధానికే ఆమె కళంకం తెచ్చింది

బీమా డబ్బు కోసం సొంత తమ్ముడినే చంపించిన దారుణ సంఘటన కడప జిల్లాలో వెలుగు చూసింది. అప్లాయపల్లెలో జూలై నెలలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. జూలై 10న వెంకటరమణారెడ్డి అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు అతని హత్యకు అతని అక్కే కారణమని తేల్చారు. బీమా డబ్బు కోసం అతడిని హత్య చేయించినట్టు పోలీసులు వివరించారు. ఆమెతో పాటు మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నట్టు వారు వెల్లడించారు.

More Telugu News