: ప్రతి ఇంటికి నీరివ్వకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం: కేసీఆర్

తెలంగాణలోని ప్రతి ఇంటికీ మంచినీటిని అందించేందుకు పక్కాగా ప్రణాళికలు రూపొందించామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. ఈ హామీని నెరవేర్చని పక్షంలో రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటి చేయబోదని ఆయన ప్రకటించారు. జంట నగరాల్లోని అన్ని ఇళ్లకు 24 గంటల పాటు నీటిని సరఫరా చేస్తామన్నారు. నాలుగేళ్లలోనే ఈ బృహత్కార్యాన్ని పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. జంట నగరాలతో పాటు రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు మంచి నీటిని సరఫరా చేసే బాధ్యతలను తమ ప్రభుత్వం తీసుకుందన్నారు. రాష్ట్రంలోని గిరిజన, దళిత కుటుంబాలకు కూడా మంచి నీటిని అందించి తీరతామని ఆయన ప్రకటించారు.

More Telugu News