: జమ్మూకాశ్మీర్ లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తాం: డీజీపీ
జమ్మూకాశ్మీర్ లో త్వరలో జరగనున్న ఎన్నికలకు అంతరాయం కలిగించాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ కే.రాజేంద్రకుమార్ తెలిపారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో తగిన భద్రత మధ్య ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. పోలింగ్ నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడతామని ఆయన వివరించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవరైనా చట్టవ్యతిరేక కార్యక్రమాలకు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.