: కేసీఆర్ వి తుపాకీ రాముడి మాటలు: పొన్నాల

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తుపాకీ రాముడి మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఖమ్మంలో సంజీవరెడ్డి భవన్ లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తూ, ఏం చేస్తున్నా చెల్లుబాటవుతోందన్న భావనతో పరిపాలన చేస్తే రాజకీయ చరిత్ర హీనులవుతారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, సర్వే పేరిట కాలయాపన చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి పార్టీలు మారాలని ఆయన సూచించారు. అలా చేసిన వారినే ఇతర పార్టీలు అక్కున చేర్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లక్ష రైతు రుణమాఫీ, రెండు పడకగదుల ఇంటి నిర్మాణాలు ఏమయ్యాయని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.

More Telugu News