: రాజధాని భూసేకరణ విషయంలో రైతులకు ఆందోళన వద్దు: యనమల
ఏపీ రాజధానికి భూమి సేకరించే విషయంలో వస్తున్న వదంతులపై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పారు. ఏమైనా అపోహలు, ఆందోళనలు ఉంటే మంత్రివర్గం, అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ మేరకు తన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, రైతులకు లాభసాటిగా ఉండే విధంగానే భూసేకరణ పాలసీ తయారుచేశామని మంత్రి తెలిపారు. రాజకీయ లబ్దికోసం కొందరు ప్రజల్లో అపోహలు కలిగిస్తున్నారని అన్నారు.