: కేసులన్నీ పరిష్కరించుకోవచ్చు... సద్వినియోగం చేసుకోండి: జస్టిస్ చంద్రయ్య
డిసెంబర్ 6న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని హైకోర్టు న్యాయసేవాధికార కమిటీ ఛైర్మన్, హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్య సూచించారు. కోర్టుల్లో ఇంకా కేసులుగా నమోదుకాని ప్రిలిటిగేషన్ వ్యవహారాలు, విచారణ దశల్లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని ఆయన కోరారు. ఏళ్ల తరబడి కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులన్నీ దీని ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు.