: భూ సేకరణలో రైతులకు భారీ లాభాలుంటాయి: మంత్రివర్గ ఉపసంఘం

ఏపీ రాజధానికి భూసేకరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. అందరినీ ఒప్పించే భూసేకరణ జరుపుతామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. రైతుల నుంచి సేకరించిన భూమిలో ప్రజా రాజధాని నిర్మిస్తామని తెలిపారు. భూసమీకరణ ద్వారా రైతులకు లాభం చేకూరుతుందని వివరించారు. 17 గ్రామాల్లో 30 వేల ఎకరాల మేర భూ సేకరణ చేపడతామన్నారు. ఇలా సేకరించిన భూమిని 6 సెక్టార్లుగా విభజిస్తామని చెప్పారు. భూమి అభివృద్ధికి ఎకరాకు రూ. 75 లక్షల నుంచి రూ. కోటి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. రైతుకు పదేళ్ళపాటు ఎకరాకు రూ.25000 ఇస్తామన్నారు. దానిని ఏటా రూ.1250 పెంచుతూ పోతామన్నారు. వీజీటీఎం స్థానంలో క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటవుతుందని మంత్రి ప్రత్తిపాటి తెలిపారు.

More Telugu News