: జగన్ కు రాంరాం... కొణతాల వెంటే నడుస్తాం: గండి బాబ్జీ

విశాఖ జిల్లా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ అధిష్ఠానానికి రాజీనామా పత్రం పంపించారు. పెందుర్తి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు అంతా కలసి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వెంటే నడుస్తామని అందులో స్పష్టం చేశారు. కొణతాల సభ్యత్వాన్ని రద్దు చేసే ముందు కనీసం ఆయన అభిమతాన్ని, సమస్యకు కారణం కూడా తెలుసుకోలేదని బాబ్జీ ఈ సందర్భంగా ఆరోపించారు. జగన్ కు పెద్ద నాయకులంటే భయమని, అందుకే వారిని పార్టీకి దూరం చేస్తున్నారని ఆయన విమర్శిచారు. తనతో పాటు 20 మంది సర్పంచులు, 18 మంది ఎంపీటీసీలు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన వివరించారు.

More Telugu News