: చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ఆరిమానుపెంట వద్ద ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంటపొలాలను పూర్తిగా ధ్వంసం చేస్తూ గడగడలాడిస్తున్నాయి. దాంతో, స్థానిక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కొన్నిరోజులుగా జిల్లాలో పలుచోట్ల ఏనుగుల గుంపులు పంటపొలాలను నాశనం చేస్తూనే ఉన్నాయి. మరోవైపు అటవీ అధికారులు ఏనుగులను అడవిలోకి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఓ సమయంలో అధికారులపైనా ఏనుగులు దాడికి పాల్పడ్డాయి.

More Telugu News