: తెలంగాణలో 500 మె.వా. విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
అసలే కరెంట్ కష్టాలతో సతమతమవుతున్న తెలంగాణ రాష్ట్రానికి... మరో సమస్య వచ్చి పడింది. కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని నాలుగో యూనిట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో, 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది.