: పోలీసుల నుంచి తప్పించుకోబోయి కాల్వలో పడిపోయాడు

పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు తప్పించుకునే ప్రయత్నంలో ఫయాజ్ అనే యువకుడు బందరు కాల్వలో పడిపోయాడు. విజయవాడలోని బందరు కాల్వ వద్ద ఓ పేకాట శిబిరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. దీనిని గమనించిన ఫయాజ్ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న బందరు కాల్వలో పడిపోయాడు. దీంతో అతని బంధువులు రాస్తారోకో చేపట్టారు. ఫయాజ్ ఆచూకీ కోసం గజఈతగాళ్లతో వెతికించాలని డిమాండ్ చేశారు.

More Telugu News