: ఫొటో పోస్టు చేసి, చూడొద్దంటూ క్యాప్షన్ పెట్టింది!
బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా ప్రస్తుతం 'బాజీరావు మస్తానీ' చిత్రంలో నటిస్తోంది. పాపం, ఈ ముద్దుగుమ్మకు కండ్లకలక సోకిందట. దీంతో, షూటింగ్ ఆపేసి ఇంటివద్దే విశ్రాంతి తీసుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ కండ్లకలకతో వాచిపోయిన తన కళ్ళను సెల్ఫీ తీసి, ఆ ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేసింది. అయితే, ఫొటోను చూడొద్దంటూ క్యాప్షన్ పెట్టింది. అన్నట్టు, ఈ పర్యాయం దీపావళికి కూడా అమ్మడు దూరంగానే ఉండాలని నిర్ణయించుకుందట.