: ఏపీ ఫిర్యాదుపై కృష్ణా రివర్ బోర్డు స్పందన
శ్రీశైలం జలాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై కృష్ణా రివర్ బోర్డు స్పందించింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల ముఖ్య కార్యదర్శికి కృష్ణా బోర్డు కార్యదర్శి ఆర్కే గుప్తా లేఖ రాశారు. జీవో-69, 107 ప్రకారం నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని లేఖలో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల నిర్ణయం మేరకే నీటి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 'అక్టోబర్ 9 నిర్ణయం ప్రకారం శ్రీశైలం నుంచి నీటి విడుదల' అన్న బోర్డు కార్యదర్శి, తాగునీరు, తరువాత సాగు అవసరాలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు.