: 'కత్తి' విడుదలపై సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి: నటుడు విజయ్

తాను నటించిన 'కత్తి' చిత్రం విడుదలకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని హీరో విజయ్ తెలిపారు. ఈ మేరకు తమిళ అనుకూల వర్గాల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ప్రొడక్షన్ పేరు నుంచి వారి పేరు (లైకా)ను సినిమా ప్రచారం నుంచి తీసివేసినట్లు ఓ ప్రకటనలో తెలిపాడు. "సినిమా విడుదలకు సామరస్య పూర్వకంగా సహకరించిన 'పురచ్చితలైవి' అమ్మకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెబుతున్నాను. తమిళనాడు పోలీసులు, థియేటర్ యాజమాన్యాలు, తమిళుల మనోభావాలను నిర్మాతలు గౌరవించి వారి పేరును తొలగించారు" అని విజయ్ పేర్కొన్నాడు. ఈ సమస్య ముగిసినందున సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులు, సాధారణ ప్రజలు చిత్రం చూసి ఎంజాయ్ చేయాలని కోరారు. దర్శకుడు ఏఆర్ మురుగుదాస్ రూపొందించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ నిర్మాణ సంస్థతో శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సకు సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. దాంతో, ఆగ్రహంచిన పలు తమిళ వర్గాలు 'లైకా' పేరును తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. దాంతో, 'కత్తి' రిలీజ్ పై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. చివరకు సమస్య తీరిపోవడంతో విడుదలయ్యేందుకు సిద్ధమైంది.

More Telugu News