: బ్లేడ్ రన్నర్ పిస్టోరియన్ కు ఐదేళ్ల జైలు శిక్ష
ప్రపంచ ప్రఖ్యాత బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియన్ కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. గత సంవత్సరం ప్రేమికుల దినోత్సవం నాడు ప్రేయసి రీవా స్టీన్ క్యాంప్ ను హత్య చేశాడన్న కేసులో... పిస్టోరియన్ కు న్యాయస్థానం ఐదేళ్ల శిక్షను ఖరారు చేసింది. తన గర్ల్ ఫ్రెండ్ టాయ్ లెట్ లో ఉండగా మూసిన తలుపులో నుంచే పిస్టోరియన్ షూట్ చేశాడు. అయితే, అది పొరపాటున సంభవించిందని కోర్టుకు విన్నవించాడు. ఘటన ఏ విధంగా జరిగినా... హత్యగానే భావించాల్సి వస్తుందని కోర్టు తెలిపింది. పిస్టోరియన్ ను హంతకుడిగా కోర్టు అభివర్ణించింది.