: వాద్రా ఎలాంటి తప్పుకూ పాల్పడలేదు... కావాలనుకుంటే విచారణ జరపండి: కాంగ్రెస్
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ ఒప్పందాలపై వస్తున్న ఆరోపణలను తక్కువ చేసి చూపేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు హర్యానా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సురెజ్ వాలా మాట్లాడుతూ, కావాలనుకుంటే వాద్రా వ్యవహారంలో దర్యాప్తు జరుపుకోవచ్చని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేశారు. "బీజేపీకి కేంద్రంలో, రాజస్థాన్ లో ప్రభుత్వం ఉంది. త్వరలో హర్యానాలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఒకవేళ వారు వాద్రా అంశంలో విచారణ జరపాలనుకుంటే జరుపుకోవచ్చు. ఆ చర్యను మేము స్వాగతిస్తాం" అని అన్నారు.