: హర్యానా విజేతల్లో 83 శాతం మంది కోటీశ్వరులేనట!

హర్యానా శాసనసభకు కొత్తగా ఎన్నికైన 90 మంది ఎమ్మెల్యేల్లో 75 మంది కోటీశ్వరులే ఉన్నారు. బీజేపీకి చెందిన 47 మంది ఎమ్మెల్యేల్లో 40 మందికి రూ.1 కోటికి పైగానే ఆస్తులున్నాయి. అదే సమయంలో ఆ పార్టీకి చెందిన ఎక్కువ మంది నేతలపై పెండింగ్ కేసులు ఉన్నాయట. 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 14 మంది కోటీశ్వరులే. 13 మంది ఐఎన్ఎల్ డీ ఎమ్మెల్యేలు, ఇద్దరు హెచ్ జేసీ శాసన సభ్యులు, ఐదుగురు స్వతంత్రులు, బీఎస్పీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే కూడా కోటీశ్వరుల జాబితాలో ఉన్నారు. రూ. 106 కోట్లతో ఫరీదాబాద్ నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే విపుల్ గోయల్, ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.

More Telugu News