: ఉద్యోగులకు వజ్రాల వ్యాపారి కార్లు బహుమతి!
దీపావళి పండుగ వస్తుందనగానే పలు సంస్థలు ఉద్యోగులకు బహుమతులు ఇవ్వడం పరిపాటి. కానీ, సూరత్ కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి మాత్రం ఏకంగా తన ఉద్యోగులకు కార్లు బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. వ్యాపారంలో ఈ ఏడాది పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకున్నందుకుగానూ ఈ బహుమతులతో వారిని సంతృప్తిపరిచాడు.
గుజరాత్ లోని సూరత్ జిల్లాలో వజ్రాల వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. ఈ క్రమంలో ఉద్యోగులు కష్టానికి ఫలితంగా రివార్డులను పొందుతున్నారు. ఈ క్రమంలో తమ యజమాని దీపావళికి ఇచ్చిన బహుమతులపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సంస్థ యజమాని మాట్లాడుతూ, "గత సంవత్సరం కూడా వ్యాపారంలో మేము ఇదే నిర్ణయం తీసుకున్నాం. ఈ నేపథ్యంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్న 1200 మంది ఉద్యోగులకు బహుమానాలందించాం" అని తెలిపారు.