: లీజు స్థలాన్ని ఆక్రమించిన విజయవాడ ఎంపీ నాని?

తమ నుంచి స్థలాన్ని విజయవాడ ఎంపీ కేశినేని నాని లీజుకు తీసుకుని ఇప్పుడు దానిని ఆక్రమించేశారని ఆరోపిస్తూ సోమవారం ఉదయం ఆయన కార్యాలయం ముందు స్థానికులు ఆందోళనకు దిగారు. తన ట్రావెల్స్ వాహనాల పార్కింగ్ కోసం నగరానికి చెందిన బొమ్మదేవర వెంకట సుబ్బారావుకు చెందిన 500 గజాల స్థలాన్ని గతంలో నాని లీజుకు తీసుకున్నారు. అయితే, లీజు గడువు ముగిసినా, ఆ స్థలాన్ని ఖాళీ చేయడానికి నాని నిరాకరిస్తున్నారట. దీంతో, సోమవారం ఉదయం సుబ్బారావు, కొందరు స్థానికులతో కలిసి నాని కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తక్షణమే నాని సదరు స్థలాన్ని ఖాళీ చేయాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News