: హర్యానాలో చౌతాలా... మహారాష్ట్రలో రాజ్: నెటిజన్ల ఫేవరెట్ పొలిటీషియన్లు
ప్రస్తుతం మహారాష్ట్ర, హర్యానాల్లో హోరాహోరీగా పోలింగ్ జరుగుతోంది. మునుపెన్నడూ లేని రీతిలో రెండు రాష్ట్రాల్లో చతుర్ముఖ పోటీ నెలకొంది. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లు ప్రచారంలో కాళ్లరిగేలా తిరిగి అలసిపోయాయి. అయితే ఆ రెండు రాష్ట్రాల ప్రజలకు హీరోలుగా అవతరించింది మాత్రం ఆ పార్టీలకు చెందిన వారు ఎంతమాత్రం కాదట. గూగుల్ సెర్చ్ వివరాల ప్రకారం... మహారాష్ట్రలో రాజ్ థాకరే నెటిజన్ల హీరోగా మారితే, హర్యానాలో జైలులో కూర్చున్న ఓం ప్రకాశ్ చౌతాలా నెటిజన్లకు ఆరాధ్య దైవంగా మారారు. వీరిద్దరి గురించి తెలుసుకునేందుకు నెజిటన్లు పోటీలు పడ్డారట. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తెలియదు కాదు కాని, వీరి అభ్యర్థిత్వంపై మాత్రం పెద్ద సంఖ్యలో నెటిజన్లు ఆసక్తి చూపారు.