: శ్రీవారి సమాచారం
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం మాత్రమే పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, నడకదారిన వెళ్లే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. తుపాను నేపథ్యంలో, తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది.