: హైదరాబాదులో కల్లు దుకాణాల ఏర్పాటుపై పిల్
ఉమ్మడి రాజధాని హైదరాబాదు నగరంలో కల్లు దుకాణాలు ఏర్పాటు చేయడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. వెంటనే స్పందించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదనంతర విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.