: కామాంధుడికి ప్రజలు ఎలాంటి శిక్ష వేశారో చూడండి!
రాజస్థాన్ లో ఓ కామాంధుడిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా అతడు పురుషాంగాన్ని కోల్పోయాడు. గంగానగర్లో అక్టోబర్ 10న సురేశ్ కుమార్ అనే ఈ వ్యక్తి ఓ టీనేజ్ బాలికపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక అరుపులు విన్న స్థానికులు ఈ కీచకుడిని పట్టుకున్నారు. అయితే, అతడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళకుండా ఓ మటన్ షాపుకు తీసుకెళ్ళారు. అక్కడ మాంసం నరికే కత్తితో అతడి పురుషాంగాన్ని కోసి, దాన్ని రోడ్డుపై విసిరేశారు. ఈ సందర్భంగా అమీర్ ధావన్ అనే స్థానికుడు మాట్లాడుతూ, అతని పరిస్థితి చూసి ఎవరూ ముందుకు రాలేదని, తగిన శాస్తి జరిగిందని వారు భావించారని అన్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. సురేశ్ కుమార్ పై దాడి చేసిన వ్యక్తులు, తాము అరెస్టు చేయకముందే, స్వచ్ఛందంగా లొంగిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.