: జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్... భారత ఆర్మీ జవాను మృతి
ఉత్తర కాశ్మీర్లోని హంద్వారా ప్రాంతంలో తీవ్రవాదులకు, జవాన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో భారత జవాను ప్రాణాలొదిలాడు. వదర్ బాలా అడవుల్లోని 30 రాష్ట్రీయ రైఫిల్స్ పై తీవ్రవాదులు దాడి చేసిన సమయంలో జవాను మృతి చెందాడు. గతరాత్రి పలువురు లష్కరే తోయిబా తీవ్రవాదులు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించారన్న ఇంటలిజెన్స్ వర్గాల సమాచారంతో ఆర్మీ కూడా వెళ్లింది. చీకటిగా ఉన్న సమయంలో తీవ్రవాదులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.