: జయ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 17న విచారణ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఈ నెల 17న (వచ్చే శుక్రవారం) సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. అప్పటి వరకు ఆమె బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులోనే గడపనున్నారు. అంతకుముందు కర్ణాటక హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో ఈ నెల 9న జయ తరపు న్యాయవాదులు సుప్రీంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.