: ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విశాఖ

హుదూద్ ధాటికి చిగురుటాకులా వణికిన సుందర విశాఖ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. నిన్నంతా ఇంటికే పరిమితమైన నగరవాసులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. నిత్యావసర వస్తువుల కోసం షాపుల ముందు బారులు తీరుతున్నారు. విశాఖలో వాతావరణం కూడా నెమ్మదిగా సాధారణ స్థితికి చేరకుంటోంది. ప్రస్తుతం వాతావరణం పొడిగానే ఉంది. నగరంలో ఎక్కడికక్కడ కూలిపోయిన చెట్లు, హోర్డింగులను తొలగించే పనిలో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైంది. విద్యుత్, టెలికాం సేవల పునరుద్ధరణపై అధికారులు దృష్టి సారించారు.

More Telugu News