: మావోలతో సమస్య ఉంటే... శాంతి దూతగా నేను వెళ్తా: గద్దర్

ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ లైన్లు వేయడానికి మావోయిస్టుల నుంచి అడ్డంకులు ఎదురవుతాయని టీఎస్ మంత్రులు చెబుతుండటంపై ప్రజా గాయకుడు గద్దర్ స్పందించారు. మంత్రులు చెబుతున్న దాంట్లో కొంత వరకు నిజం కూడా ఉండవచ్చని... ఒకవేళ అదే సమస్య అయితే, మావోయిస్టులతో చర్చించేందుకు శాంతి దూతగా తాను ఛత్తీస్ గఢ్ వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్రభుత్వం కోరితే ఈ విషయంలో తన సహకారాన్ని అందిస్తానని స్పష్టం చేశారు.

More Telugu News