: విండీస్ జట్టుకు జరిమానా

వెస్టిండీస్ జట్టుకు స్లో ఓవర్ రేట్ జరిమానా విధించారు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో టీమిండియాతో జరిగిన రెండో వన్డే సందర్భంగా నిర్ణీత సమయానికి కరీబియన్లు ఓవర్లను పూర్తి చేయలేకపోయారు. ఐసీసీ నియమావళి ప్రకారం ఆర్టికల్ 2.5.1 అనుసరించి దీన్ని స్వల్ప తప్పిదంగా భావించి జరిమానా వడ్డించారు. కెప్టెన్ డ్వేన్ బ్రావో మ్యాచ్ ఫీజులో 40 శాతం, ఆటగాళ్ళ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పెట్టారు. విండీస్ జట్టు వచ్చే 12 నెలల్లో మరోసారి ఇలాంటి తప్పిదానికి పాల్పడితే కెప్టెన్ బ్రావో ఓ వన్డే నిషేధానికి గురవుతాడు.

More Telugu News