: 'ఐ' తీరాన్ని దాటింది... ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలిగాం: చంద్రబాబు
తుపాను వల్ల సంభవించే ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలిగామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం విధుల్లో నిమగ్నమై ఉందని తెలిపారు. హుదూద్ తుపాను వల్ల ఎలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశామని... లేకపోతే ఎంతో ప్రమాదం వాటిల్లేదని వెల్లడించారు. ప్రస్తుతం సైక్లోన్ ఐ (నేత్రం) తీరాన్ని దాటిందని చెప్పారు. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రానికి రాడార్ తో కనెక్షన్ కట్ కావడంతో కరెక్ట్ గా సమాచారం అందడంలేదని... అయినప్పటికీ అందుబాటులో ఉన్న ఇతర మార్గాల ద్వారా సమస్యను అధిగమించే ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. అయితే, తుపాను పూర్తిగా తీరం దాటేందుకు మాత్రం మరి కొన్ని గంటలు పడుతుందని చెప్పారు. తుపానును అరికట్టడం మన వల్ల కాదని... కానీ, నష్టాన్ని మాత్రం నివారించగలమని చెప్పారు.