: విజయనగరం జిల్లాలో ఇళ్లలోకి చొచ్చుకొస్తున్న అలలు

శరవేగంగా దూసుకొస్తున్న హుదూద్ ప్రభావంతో సముద్రం భయానకంగా మారింది. ఈ నేపథ్యంలో, విజయనగరం జిల్లా బోగాపురం మండలం ముక్కాములో రాకాసి అలలు 5 మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతూ, ఒడ్డున ఉన్న ఇళ్లలోకి చొచ్చుకు వస్తున్నాయి. దీంతో, తమ నివాసాలు దెబ్బతింటాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ప్రజలను బలవంతంగా సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నారు. ఇప్పటికే, సముద్రం ఒడ్డున ఉన్న పడవలు దెబ్బతిన్నాయని తెలుస్తోంది.

More Telugu News