: ప్రైవేట్ బస్సులో పట్టుబడిన రూ. కోటి
అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఏకంగా కోటి రూపాయలు పట్టుబడ్డాయి. నెల్లూరు జిల్లా తడ మండలం బీవీపాలెం చెక్ పోస్టు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సులో తరలిస్తున్న ఈ భారీ మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తులను విచారిస్తున్నారు. ఈ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వస్తోంది.