: హైదరాబాద్ బేగంబజార్ లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ లోని బేగంబజార్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫీల్ ఖానా వద్ద నాలుగు అంతస్తుల భవనంలో ఉన్న బాణాసంచా దుకాణంలో మంటలు చెలరేగాయి. షాపులోని బాణాసంచా తగలబడుతోంది. ఇతర దుకాణాలకు కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అనుమతులు లేకుండానే ఈ భవనంలో కొందరు బాణాసంచా దుకాణం పెట్టారని... ప్రస్తుతం మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నామని... అనంతరం బాణాసంచా దుకాణం పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.

More Telugu News