: ప్రధాని వద్ద విద్యుత్ సమస్యను కేసీఆర్ ఎందుకు లేవనెత్తడం లేదు?: రేవంత్ రెడ్డి

విద్యుత్ సమస్యకు తమ అధినేత చంద్రబాబే కారణమంటున్న టీఆర్ఎస్ నాయకులపై టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో విద్యుత్ సమస్య ఉండటమేంటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు చంద్రబాబును విమర్శించడం మానుకోవాలని... దమ్ముంటే కేసీఆర్ ను నిలదీయాలని సూచించారు. విద్యుత్ సమస్యను ఇంతవరకు ప్రధాని మోడీ దగ్గర కేసీఆర్ ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని అన్నారు.

More Telugu News