: నోబెల్ బహుమతి పొందిన భారతీయులు వీరే...!
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి భారతీయ బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్ధికి రావడంతో గతంలో ఎంత మంది భారతీయులు నోబెల్ సాధించారనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నోబెల్ పురస్కారం గెలుచుకున్న భారతీయుల వివరాలు ఇవిగో...
* 1913లో రవీంద్రనాథ్ టాగోర్ సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ దక్కించుకున్నారు.
* 1930లో సర్ సీవీ రామన్ భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకున్నారు.
* 1968లో హర్ గోవింద్ ఖొరానా వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి పుచ్చుకున్నారు.
* 1979లో మదర్ థెరెస్సా నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.
* 1983లో సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ కు భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం వచ్చింది.
* 1998లో అర్థశాస్త్రంలో అమర్త్యసేన్ ను నోబెల్ బహుమతి వరించింది.
* 2014లో శాంతి బహుమతి కైలాష్ సత్యార్థి అందుకోనున్నారు.
వీరు మాత్రమే కాకుండా భారత్ తరపున కానప్పటికీ నోబెల్ బహుమతి అందుకున్న భారతీయులు ఉన్నారు.
* భారత్ లో పుట్టిన బ్రిటిష్ పౌరులు రోనాల్డ్ రాస్. రుడ్ యార్డ్ కిప్లింగ్,
* భారత్ లో పుట్టి ఇతరదేశాల్లో స్థిరపడిన వెంకట్రామన్ రామకృష్ణన్ కు 2009లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.
* ట్రినిడాడ్ లో పుట్టి బ్రిటన్ లో స్థిరపడిన భారత సంతతి వ్యక్తి వీఎస్ నైపాల్ కు,
* భారత్ లో పుట్టిన పాకిస్థాన్ పౌరుడు అబ్దున్ సలాంకు నోబెల్ పురస్కారం దక్కింది.
* టిబెట్ లో పుట్టి భారత్ లో నివసిస్తున్న దలైలామాకు నోబెల్ శాంతి పురస్కారం లభించింది.
* భారత్ లో పుట్టిన బంగ్లాదేశ్ పౌరుడు మహ్మద్ యూనన్ కు నోబెల్ ప్రైజ్ దక్కింది.
* ఐపీసీసీ పేరిట భారతీయుడు రాజేంద్ర కుమార్ పచౌరీ నిర్వహిస్తున్న ఛారీటీ సంస్థ కూడా నోబెల్ ప్రైజ్ గెలుచుకుంది.