: ఆళ్లగడ్డలో సహకరించండి: చంద్రబాబుకు వైకాపా విజ్ఞప్తి

త్వరలో జరగనున్న ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు గానూ భూమా నాగిరెడ్డి కుమర్తె భూమా అఖిలప్రియను తమ అభ్యర్థిగా వైకాపా ప్రకటించింది. వెంటనే వైకాపా నేతలు ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో, వైకాపా కీలక నేతలు మైసూరా రెడ్డి, ధర్మాన ప్రసాదరావు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఉప ఎన్నికలో టీడీపీ తరపున అభ్యర్థిని నిలబెట్టరాదని విజ్ఞప్తి చేశారు. అయితే, వారి వినతికి చంద్రబాబు నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు. మరోవైపు, భూమా నాగిరెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా మరణించినప్పుడు... వారి కుటుంబసభ్యులు ఎన్నికల బరిలోకి దిగితే... వారిపై పోటీకి నిలుపకుండా ఇంత కాలం అన్ని పార్టీలు ఒక ఆచారాన్ని పాటిస్తూ వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఆళ్లగడ్డ ఉపఎన్నికలో కూడా టీడీపీ ఇదే సంప్రదాయాన్ని పాటిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News