: విండీస్ భారీ స్కోరు సాధిస్తుందా..?
ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా కొచ్చిలో జరుగుతున్న తొలి మ్యాచ్ లో వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్నారు. ఓపెనర్ డ్వేన్ స్మిత్ (4 ఫోర్లు 2 సిక్సులతో 46) చక్కని పునాది వేయగా, మిడిలార్డర్ లో మార్లోన్ శామ్యూల్స్ (69*) టీమిండియా బౌలర్లకు కొరకరాని కొయ్యలా పరిణమించాడు. రామ్ దిన్ (35*) అతడికి అండగా క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం విండీస్ స్కోరు 37 ఓవర్లలో 3 వికెట్లకు 213 పరుగులు. భారత బౌలర్లలో షమి, జడేజా, మిశ్రా తలో వికెట్ పడగొట్టారు. విండీస్ మిడిలార్డర్ ఊపు చూస్తుంటే భారీ స్కోరు ఖాయంగా కనిపిస్తోంది!