: 72వ పుట్టినరోజున ఫాన్స్ తో బిగ్ బీ ఇంటరాక్షన్
బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ఈ నెల 11న తన 72వ పుట్టినరోజు వేడుకలను జరుపుకోనున్నారు. ఈసారి ప్రత్యేకంగా ఆయన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా తన అభిమానులతో ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్ ఇతర సైట్లలో బిగ్ బీ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను పోస్టు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన పుట్టినరోజున ట్విట్టర్ లో @SrBachchan ఖాతాకు #AB72 అనే ట్యాగ్ తో ఫాన్స్ అమితాబ్ కు శుభాకాంక్షలు పంపవచ్చు. లక్కీ ఫ్యాన్స్ అమితాబ్ డిజిటల్ ఆటోగ్రాఫ్ ఉన్న పోస్టర్ ను బహుమతిగా పొందుతారు. అంతేగాక, బిగ్ బీ పర్సనల్ మెసేజ్ పొందుపరిచిన వీడియో రికార్డింగ్ ను ఒక లక్కీ అభిమాని పొందుతారు.