: మనల్ని చూసి పేదరికం భయపడాలి: చంద్రబాబు

మనల్ని చూసి పేదరికం భయపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా శావల్యాపురంలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న బాబు ఈ సందర్భంగా మాట్లాడారు. పేదవారిని అన్ని విధాలా ఆదుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఉద్ఘాటించారు. పింఛన్లపై ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా పేదలకు రూ.8 కోట్లు ఇచ్చిన ఘనత తమదేనని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధించాలని బాబు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ప్రతి మహిళ పారిశ్రామిక వేత్త కావాలని పిలుపునిచ్చారు. డ్వాక్రా సంఘాలు కట్టిన వడ్డీని పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా సంఘాలు పట్టుదలకు మారుపేరు అని కొనియాడారు.

More Telugu News