: అర్ధ సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే ఆదాయం రూ. 3,966 కోట్లు
దక్షిణ మధ్య రైల్వే ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల ఆదాయాన్ని ప్రకటించింది. అర్ధ సంవత్సరంలో రూ. 3,966 కోట్ల ఆదాయాన్ని పొందినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, గూడ్స్ రవాణాలో గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 16 శాతం వృద్ధిని సాధించామని తెలిపారు.