: నవంబర్ 8న ఆళ్లగడ్డ ఉపఉన్నిక
వైఎస్సార్సీపీ దివంగత నేత శోభానాగిరెడ్డి నియోజకవర్గంలో ఉపఎన్నికకు ఎన్నికల సంఘం తేదీ ఖరారు చేసింది. నవంబర్ 8న ఆళ్లగడ్డలో ఉపఎన్నిక నిర్వహించనున్నామని ఈసీ వెల్లడించింది. 12 తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నెల 14న ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నెల 21 నుంచి నామినేషన్లు వేసుకోవచ్చని, 22న నామినేషన్లు పరిశీలిస్తారని, 24న నామినేషన్ల ఉపసంహరణకు గడువని ఈసీ స్పష్టం చేసింది.