: అన్నా డీఎంకే పోస్టర్ బెదిరింపులు!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్ పై నేడు కర్ణాటక హైకోర్టు విచారణ జరపనుంది. 'అమ్మ' దుస్థితి పట్ల అన్నా డీఎంకే కార్యకర్తల్లో తీవ్ర అసహనం నెలకొంది. తమ అధినేత్రి జైల్లో ఉండడం వారిని కలచివేస్తోంది. ఈ నేపథ్యంలో అన్నా డీఎంకే పేరిట వెలిసిన పోస్టర్లు ఉద్రిక్తత రేపే విధంగా ఉన్నాయి. జయ విడుదల కాకపోతే తమిళనాడులో నివసిస్తున్న కన్నడిగులను నిర్బంధిస్తామని ఆ పోస్టర్లలో హెచ్చరించారు. అటు, జయలలిత ఉంటున్న పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలు పరిసరాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా నిషేధాజ్ఞలు విధించారు.

More Telugu News