: అభిషేక్ ను చూస్తే గర్వంగా ఉంది: పుత్రోత్సాహం ప్రదర్శించిన అమితాబ్
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పుత్రవాత్సల్యం ప్రదర్శించారు. దేశీయ క్రీడ కబడ్డీని అభిషేక్ ప్రోత్సహించడం అభినందనీయమని బిగ్ బీ తెలిపారు. ప్రొ కబడ్డీలీగ్ జైపూర్ ఫాంథర్స్ జట్టును అభిషేక్ బచ్చన్ కొనుగోలు చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జట్టుతోపాటు, భార్య ఐశ్వర్యారాయ్ ను కూడా తీసుకెళ్లేవారు.
ముంబై, ఇతర చోట్ల అమితాబ్ బచ్చన్ తో పాటు పలువురు బాలీవుడ్ నటులను కూడా తీసుకెళ్లడంతో కబడ్డీకి విశేషమైన ఆదరణ లభించింది. అభిషేక్ దేశీయ క్రీడను ప్రోత్సహించిన విధానం తనను ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు. అభిషేక్ చేసిన పనికి తాను గర్విస్తున్నానని ఆయన తెలిపారు.