: భారత సైన్యం సర్వసన్నద్ధంగానే ఉంది: అరుణ్ జైట్లీ

కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తున్న పాకిస్తాన్ ను నిలువరించేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగానే ఉందని రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సోమవారం ఆయన వ్యాఖ్యానించారు. పాక్ దుశ్చర్యల కారణంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు నానాటికి జటిలమవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తరహా చర్యలు ఇరుదేశాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనేందుకు విఘాతం కలిగిస్తున్నాయని ఆయన ఆరోపించారు. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖల వెంట పాక్ నిత్యం జరుపుతున్న కాల్పుల కారణంగా సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ కవ్వింపు చర్యలకు చెక్ పెట్టేందుకు భారత సైన్యంతో పాటు పారా మిలిటరీ బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.

More Telugu News