: విశాల్ మంచి నటుడే కాదు, మంచి నిర్మాత కూడా!: శ్రుతిహాసన్
హీరో విశాల్ మంచి నటుడని అందరూ చెప్పినట్టే తాను కూడా చెబుతానని శ్రుతిహాసన్ తెలిపింది. పూజ సినిమా ఆడియో విడుదల సందర్బంలో హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, విశాల్ రాముడు మంచి బాలుడు టైపు వ్యక్తని అన్నారు. విశాల్ నిర్మాతగా ఎంత కసితో పని చేశారో తాను చూశానని ఆమె తెలిపారు. విశాల్ పెట్టిన ఎఫర్ట్ తో సినిమా అద్భుతంగా వచ్చిందని ఆమె తెలిపారు. దీపావళికి కుటుంబ సభ్యులంతా పూర్తిగా ఆనందించే సినిమా 'పూజ' అని ఆమె కితాబునిచ్చారు. ఆడియోని విడుదల చేసి ఆమె హీరో నితిన్ కు అందజేశారు.