: స్నేహితురాలిని బెదిరించి... వివాహితపై సామూహిక అత్యాచారం

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. స్నేహితురాలితో కలసి ఇంటి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లిన వివాహిత(25)పై ఇద్దరు యువకులు దాడి చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివాహిత, తన స్నేహితురాలితో కలసి ఇంటికి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. దీనిని గమనించిన బమన్ హెరీ గ్రామానికి చెందిన ఉత్తమ్ చంద్, బావర్ సింగ్ లు స్నేహితురాలిని బెదిరించారు. వెళ్లకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో ఆమె బతుకు జీవుడా అంటూ పారిపోయింది. దీంతో దుండగులిద్దరూ వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అడ్డుకునేందుకు ప్రయత్నించిన వివాహితను తీవ్రంగా గాయపరిచి తమ కామదాహం తీర్చుకున్నారు. దీంతో భాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి వారిని అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

More Telugu News